అమరావతి, 21 సెప్టెంబర్ (హి.స.)
భారీ వర్షాల నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాలోని వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరువూరు మండలం లక్ష్మీపురం- మల్లెల గ్రామాల మధ్య వరద అలుగుపై నుంచి ప్రవహిస్తోంది. దీంతో విస్సన్నపేట - తిరువూరు మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రమాదం అంచునే వాహనదారులు ప్రయాణిస్తున్నారు. మరోవైపు గంపలగూడెం మండలం వినగడప సమీపంలోని కట్టలేరు వంతెన వద్ద రోడ్డుపై వరద చేరడంతో వాహనాల రాకపోకలను దారి మళ్లించారు. ఈ
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ