హైదరాబాద్:21 సెప్టెంబర్ (హి.స.) ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణలో నేడు, రేపు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నేడు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్‌తో పాటు రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు భారీవర్ష సూచన ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
రేపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ