అమరావతి, 21 సెప్టెంబర్ (హి.స.)
,:ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలతోపాటు పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆదివారం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ స్పందించారు. అమరావతిలో సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ.. రాగల మూడు గంటల్లో కాకినాడ, అనకాపల్లి, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ