హెచ్సీయూ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఏబీవీపీ ప్యానెల్ ఘన విజయం
హైదరాబాద్, 21 సెప్టెంబర్ (హి.స.) హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో జరిగిన విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఏబీవీపీ, ఎస్ఎల్పీడీ ప్యానెల్ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ఎన్ఎస్ యూఐ, ఏబీవీపీ, ఎస్ఎఫ్ఎ ప్యానెల్ లు పోటీ చేశాయి. సెంట్రల్ యూనివర్సిటీ భూముల వి
ఏబీవీపీ ప్యానెల్


హైదరాబాద్, 21 సెప్టెంబర్ (హి.స.)

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో

జరిగిన విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఏబీవీపీ, ఎస్ఎల్పీడీ ప్యానెల్ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ఎన్ఎస్ యూఐ, ఏబీవీపీ, ఎస్ఎఫ్ఎ ప్యానెల్ లు పోటీ చేశాయి. సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కఠిన చర్యలు తర్వాత జరిగిన ఈ ఎన్నికలు ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారంలో పాల్గొన్నాయి.

ఈ ఎన్నికల్లో క్యాంపస్ లోని అర్హత గల 81 శాతం విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వివిధ విభాగాలలోని 29 పోలింగ్ బూత్లలో ఓపికగా క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

కాగా ఈ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు శనివారం ప్రారంభం కాగా అర్ధరాత్రి వరకు 40 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరిగింది. ఈ ఓట్ల లెక్కింపులో ఏబీవీపీ, ఎస్ ఎల్ వీడి ప్యానెల్ అన్ని ప్రధాన స్థానాలను క్లీన్ స్వీప్ చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande