హైదరాబాద్, 21 సెప్టెంబర్ (హి.స.)
క్యాప్స్ గోల్డ్ (Caps Gold)లో ఐటీ అధికారుల నాన్ స్టాఫ్ తనిఖీలు జరుగుతున్నాయి. ఇవాళ ఐదో రోజు ఐటీ అధికారులు సోదాలు కొనసాగించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 తో పాటు.. మహంకాళి స్ట్రీట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. తనిఖీల నేపథ్యంలోనే సికింద్రాబాద్ లోని క్యాప్స్ గోల్డ్ కార్యాలయం సీజ్ చేసినట్లు సమాచారం. ఈ సోదాల్లో ల్యాప్టాప్లు, పెన్డ్రైవ్లు, కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. క్యాప్స్ గోల్డ్ కంపెనీ ఈ ఏడాదిలో 20 వేల కోట్లకు పైగా బిజినెస్ చేసింది. ఈ మేరకు క్యాప్స్ గోల్డ్ యజమానులు, బంధువుల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. కంపెనీ యజమానులు చందా శ్రీనివాస్, అభిషేక్ న్ను అధికారులు విచారిస్తున్నారు. బంగారం స్కీమ్లు నడిపిస్తున్న క్యాప్స్ గోల్డ్.. పన్ను చెల్లింపుల్లో అవకతవలకు పాల్పడినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్, గుంటూరు, విజయవాడలో బంధువులను బినామీలుగా ఉంచినట్లు అధికారుల సమాచారం. కాగా, నిన్నటి సోదాల్లో రూ. 50 లక్షల నగదు, బంగారం బిస్కెట్లు అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అదేవిధంగా బ్లాక్ మార్కెట్ నుంచి బంగారం కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నట్లు కూడా అధికారుల తనిఖీల్లో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..