హైదరాబాద్, 21 సెప్టెంబర్ (హి.స.)
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామంలో నీటి ఎద్దడి నివారించడానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) సహకారంతో రూ. 60 లక్షల నిర్మాణ వ్యయంతో అభివృద్ధి చేసిన రెండు ఊట బావులను మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ యాజమాన్యం సహకారంతో పారిశ్రామిక పార్కులో ఒకటి, దండు మల్కాపురం గ్రామంలో మరొక ఊట బావిని అభివృద్ధి చేశారు. ఈ ఊట బావుల నిర్మాణానికి సహకరించిన ఐఓసీఎల్ సిబ్బందికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పుష్పగుచ్చాలు అందజేసి అభినందించారు. ---------------
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..