మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎక్స్‌’ ఖాతా హ్యాక్‌.. పాక్‌, టర్కీ జెండాలు ప్రత్యక్ష్యం
ముంబై:న్యూఢిల్లీ,21,సెప్టెంబర్ (హి.స.) మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అధికారిక ‘ఎక్స్‌’ ఖాతా హ్యాక్ అయ్యింది. హ్యాకర్లు.. షిండే ప్రొఫైల్‌కు యాక్సెస్ అయ్యి, పాకిస్తాన్, టర్కీ జాతీయ జెండాల ఫొటోలను షేర్ చేశారు. ఈ కార్యకలాపాలు అటు షిండే అనుచరుల
Two people arrested for threatening to blow up Deputy Chief Minister Shindes car with a bomb


ముంబై:న్యూఢిల్లీ,21,సెప్టెంబర్ (హి.స.) మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అధికారిక ‘ఎక్స్‌’ ఖాతా హ్యాక్ అయ్యింది. హ్యాకర్లు.. షిండే ప్రొఫైల్‌కు యాక్సెస్ అయ్యి, పాకిస్తాన్, టర్కీ జాతీయ జెండాల ఫొటోలను షేర్ చేశారు. ఈ కార్యకలాపాలు అటు షిండే అనుచరులు, పార్టీ వర్గాలను కలవరపెడుతున్నాయి. ఈ అనధికార పోస్ట్‌లను తొలగించే ముందు కొద్ది కాలం పాటు ఫొటోలను లైవ్‌లో ఉంచిన షిండే కార్యాలయ అధికారులు.. సైబర్ ఎటాక్‌ను త్వరగా గుర్తించామని, ఖాతాను సురక్షితంగా ఉంచేందుకు వెంటనే దిద్దుబాటు చర్యలు ప్రారంభించామని తెలిపారు.

ఆసియా కప్‌లో భారత్‌- పాక్‌లు తమ రెండవ మ్యాచ్ ఆడబోతున్న(ఆదివారం) రోజున హ్యాకర్లు రెండు ఇస్లామిక్ దేశాల ఫొటోలను ప్రత్యక్ష ప్రసారం చేశారు. ‘మేము సైబర్ క్రైమ్ పోలీసులను వెంటనే అప్రమత్తం చేశాం. సమస్య పరిష్కారం అయ్యింది’ అని ఒక అధికారి తెలిపారు. ఈ ఖాతాను క్రమబద్ధీకరించేందుకు 30 నుండి 45 నిమిషాల సమయం పట్టిందని ఆ అధికారి తెలిపారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande