హైదరాబాద్, 21 సెప్టెంబర్ (హి.స.)
ఎవరు ఎంత నిష్పత్తిలో ఉంటే వారికి అంత వాటా అనే రాహుల్ గాంధీ నినాదానికి కట్టుబడి కుల సర్వే నిర్వహించామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నెక్లెస్ రోడ్లో ఇందిరాగాంధీ కాంస్య విగ్రహం వద్ద తెలంగాణ బంజారా భారతి ఆధ్వర్యంలో లంబడాలను షెడ్యూల్ ట్రైబ్ రిజర్వేషన్లలో చేర్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ హాజరై ఇందిరా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉక్కు మహిళ ఇందిరా గాంధీ దేశంలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకొచ్చారని తెలిపారు. సీలింగ్ ఆక్ట్ ద్వారా పేదలకు భూములు పంచిన మహానియురాలు ఇందిరా గాంధీ అని కొనియాడారు. బంజరాలను షెడ్యూల్డ్ ట్రైబ్లో చేర్చిన చలువ ఆమెదేనని అన్నారు. అన్ని వర్గాలకు కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం ఉందన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..