సమస్యలు పరిష్కరించాలంటూ పాడి రైతుల నిరాహార దీక్ష..
తెలంగాణ, యాదగిరిగుట్ట. 21 సెప్టెంబర్ (హి.స.) రైతులకు పెండింగ్ బిల్లులు చెల్లించిన తరువాతనే నార్మూల్ సంస్థ ఎన్నికలు నిర్వహించడంతో పాటు పలు డిమాండ్స్ నెరవేర్చాలని కోరుతూ యాదగిరిగుట్టలో ఆదివారం పాడి రైతులు నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు
పాడి రైతులు


తెలంగాణ, యాదగిరిగుట్ట. 21 సెప్టెంబర్ (హి.స.)

రైతులకు పెండింగ్ బిల్లులు చెల్లించిన తరువాతనే నార్మూల్ సంస్థ ఎన్నికలు నిర్వహించడంతో పాటు పలు డిమాండ్స్ నెరవేర్చాలని కోరుతూ యాదగిరిగుట్టలో ఆదివారం పాడి రైతులు నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యాదాద్రి, చెర్వుగట్టు, వేములకొండ, కీసర దేవాలయాలకు నెయ్యి పంపిణీని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గత కొన్ని సంవత్సరాలు ప్రభుత్వ హాస్టళ్లకు పంపిణీ చేస్తున్న 12 వేల లీటర్ల పాలను నిలిపివేసినందున వెంటనే వాటిని పునరుద్దరించాలని కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande