మూసీ పునరుజ్జీవనానికి శుభారంభం.. 39 ఎస్టీపీలకు శంకుస్థాపన చేయనున్న సీఎం..
హైదరాబాద్, 21 సెప్టెంబర్ (హి.స.) మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. జలమండలి ఆధ్వర్యంలో చేపట్టనున్న 39 ఎస్టీపీల (STPs) నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 26న శంకుస్థాపన చేయనున్నారు. అయితే ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) ప
మూసి రివర్ ప్రాజెక్టు


హైదరాబాద్, 21 సెప్టెంబర్ (హి.స.)

మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. జలమండలి ఆధ్వర్యంలో చేపట్టనున్న 39 ఎస్టీపీల (STPs) నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 26న శంకుస్థాపన చేయనున్నారు. అయితే ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల నుంచి వచ్చే మురుగునీరు మూసీలో కలవకుండా ఎక్కడికక్కడే శుద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఓఆర్ఆర్ పరిధిలో అమృత్ 2.0లో 39 సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ (ఎస్టీపీలు)లను ఏర్పాటు చేసే బాధ్యతలను జలమండలికి ప్రభుత్వం అప్పగించింది. వీటిని హైబ్రిడ్ యాన్యుటీ మోడ్లో భాగంగా 40 శాతం ప్రభుత్వ వాటా, 60 శాతం కాంట్రాక్టు ఏజెన్సీ వాటా కింద ఖర్చు చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande