నేడు జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం
న్యూఢిల్లీ,21,సెప్టెంబర్ (హి.స.) ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నేడు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఆయన మాట్లాడనున్నారు. జీఎస్టీ సంస్కరణలు రేపటి నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో మోదీ ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. సామాన్య, మధ్యతరగ
Source -x @narendramodi


న్యూఢిల్లీ,21,సెప్టెంబర్ (హి.స.) ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నేడు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఆయన మాట్లాడనున్నారు. జీఎస్టీ సంస్కరణలు రేపటి నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో మోదీ ప్రసంగంపై ఆసక్తి నెలకొంది.

సామాన్య, మధ్యతరగతి ప్రజలపై ధరల భారం దించుతూ జీఎస్టీ మండలి ఇటీవల కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న నాలుగు శ్లాబుల బదులు ఇకపై రెండే కొనసాగనున్నాయి. వాటిలో ఒకటి 5% కాగా రెండోది 18%. దీని ప్రకారం 12%, 28% పన్ను శ్లాబులు ఇక ఉండవు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande