రేపు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కాలేజీల బంద్‌.. కారణం ఇదే!
అమరావతి, , 21 సెప్టెంబర్ (హి.స.) తెలంగాణ రాష్ట్రంలో కాలేజీల బంద్‌కు సంబంధించిన వ్యవహారం సర్దుమనిగిన సంగతి తెలిసిందే. ఇక పొరుగున ఉన్న ఏపీలోనూ ఇప్పుడు సమ్మె సైరన్‌ మోగనుంది. ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో బోధన రుసుములను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశాయి
Private degree colleges announces indefinite closure from Septem


అమరావతి, , 21 సెప్టెంబర్ (హి.స.) తెలంగాణ రాష్ట్రంలో కాలేజీల బంద్‌కు సంబంధించిన వ్యవహారం సర్దుమనిగిన సంగతి తెలిసిందే. ఇక పొరుగున ఉన్న ఏపీలోనూ ఇప్పుడు సమ్మె సైరన్‌ మోగనుంది. ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో బోధన రుసుములను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశాయి. లేదంటే సెప్టెంబరు 22 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీలను మూసివేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు ఏపీ ప్రైవేటు డిగ్రీ కళాశాల యాజమాన్యాల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పొన్నాన జయరాం, పొదిలి పెద్దిరాజు ఓ ప్రకటనలో తెలిపారు. మంగళగిరిలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ మధుమూర్తికి వినతిపత్రం సైతం సమర్పించారు.

వెంటనే బోధన రుసుములను విడుదల చేయకపోవడంతో సర్కార్ జాప్యం చేస్తుంది. ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఎదుర్కొంటున్న సమస్యలపై పలుమార్లు అధికారులు, నాయకుల దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారం మాత్రం లభించడం లేదని ఏపీ ప్రైవేటు డిగ్రీ కళాశాల యాజమాన్యాల సంఘం పేర్కొంది. వర్సిటీలకు ఫీజులు కట్టకపోతే పనులు చేయడం లేదని వాపోయారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande