ట్రిపుల్ ఆర్ భూనిర్వాసితులకు అండగా ఉంటాం : కోదండరాం
హైదరాబాద్, 21 సెప్టెంబర్ (హి.స.) త్రిబుల్ ఆర్ భూనిర్వాసితులకు తమ పార్టీ అండగా ఉంటుందని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం హామీ ఇచ్చారు. రీజినల్ రింగ్ రోడ్డు భూ నిర్వాసితులు తమకు అండగా ఉండాలని కోరుతూ ఆయనను హైదరాబాద్ లోని పార్టీ కా
కోదండరాం


హైదరాబాద్, 21 సెప్టెంబర్ (హి.స.)

త్రిబుల్ ఆర్ భూనిర్వాసితులకు తమ పార్టీ అండగా ఉంటుందని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం హామీ ఇచ్చారు. రీజినల్ రింగ్ రోడ్డు భూ నిర్వాసితులు తమకు అండగా ఉండాలని కోరుతూ ఆయనను హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ఆదివారం కలిశారు. పెద్ద ఎత్తున హాజరైన ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితులను ఉద్దేశించి కోదండరాం మాట్లాడుతూ.. గతంలో అనేక పోరాటాలలో టీజేఎస్ రైతుల పక్షాన పోరాటం చేసిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. న్యాయం కోసం రైతులతో పాటు ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొంటామని అన్నారు. ప్రభుత్వం ఎందుకు తీసుకోవద్దు అనేది రైతులు అన్ని విషయాలు అధ్యయనం చేయాలని కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande