భారీ వర్షాల వల్ల నష్టపోయిన అన్నదాత.. ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూపులు..
తెలంగాణ, కామారెడ్డి. 21 సెప్టెంబర్ (హి.స.) ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పాటు అడపా దడపా కురుస్తున్న వర్షాలు, పొంగుతున్న వాగుల తో కామారెడ్డి జిల్లాలో వేలాది ఎకరాల్లో పంట నష్టం జరగడంతో అన్నదాత ఊహించని రీతిలో తీవ్రంగా నష్టాల పాలు కావాల్సి వచ్చింది. ఇస
అన్నదాత


తెలంగాణ, కామారెడ్డి. 21 సెప్టెంబర్ (హి.స.)

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో

పాటు అడపా దడపా కురుస్తున్న వర్షాలు, పొంగుతున్న వాగుల తో

కామారెడ్డి జిల్లాలో వేలాది ఎకరాల్లో పంట నష్టం జరగడంతో అన్నదాత ఊహించని రీతిలో తీవ్రంగా నష్టాల పాలు కావాల్సి వచ్చింది. ఇసుక మేటలు వేసి, పంటలు నీట మునిగి, నేలకొరిగి, మురిగిపోయి రైతులు భారీగా నష్ట పోయారు. పంట నష్టం అంచనా వేసిన అధికారులు నివేదికలను ప్రభుత్వానికి పంపినా, నష్ట పరిహారం విషయంలో స్పష్టమైన ప్రకటనేది ప్రభుత్వం వైపు నుంచి ఇంతవరకు రాలేదు. దీంతో పంటలు నష్టపోయిన రైతులు ప్రభుత్వ సాయం కోసం ఆశగా ఎదిరుచూస్తున్నారు. చేనుల్లో వేసిన పత్తి, మొక్కజొన్న పంటలు బాగా పండి దిగుబడి బాగా వస్తుందనుకున్న రైతుల ఆశలపై వర్షాలు నీళ్లు జల్లాయి.

పంటల సాగుకోసం పెట్టిన పెట్టుబడి తిరిగి పెద్ద మొత్తంలో అంతుందనుకున్న రైతు ఆశలు ఆవిరై పోయాయి. ఈ నష్టంతో కుంగిపోతున్న రైతులకు ప్రభుత్వ సాయం కూడా అందదన్న భయం పట్టుకుంది. ప్రభుత్వ నిబంధన ప్రకారం అధికారులు పంట నష్టాన్ని పరిశీలించాలంటే వర్షానికి పంట కొట్టుకుపోతేనో, ఇసుక మేటలు ఉంటేనో పంట నష్టపరిహారం కింద పరిగణించవచ్చని అధికారులంటున్నారు. పరిహారంపై అధికారులు రైతులకు చెప్తున్న నిబంధనలు రైతన్నల ఆవేధనను రెట్టింపు చేస్తున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande