తెలంగాణ, మెదక్. 21 సెప్టెంబర్ (హి.స.)
మెదక్ జిల్లా నర్సాపూర్ సిఎస్ఐ చర్చి ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ సీఎస్ఐ సంఘాల నేతలు ఆదివారం చర్చి ముందు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల్లో 125 ప్యానల్ ఓటుకు నోటుకు పాల్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రెస్ బేటర్ ఇంచార్జ్ దారా సందీప్ కుమార్ ను సస్పెండ్ చేయాలని సభ్యులు డిమాండ్ చేశారు. స్వలాభం కోసం అక్రమంగా సీఎస్ఐ కాన్స్టిట్యూషన్ కి విరుద్ధంగా గ్రామాల నుండి పిసి మెంబర్లను ఎన్నుకున్నారని ఆరోపించారు.
ఓటుకు నోటు ప్రోత్సహించి ఇల్లీగల్గా ఎన్నికలు నిర్వహించిన రేవ్ ధార సందీప్ ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నికలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని క్రైస్తవ సంఘ సభ్యులు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు