మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ.. మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్
వరంగల్, 21 సెప్టెంబర్ (హి.స.) ఊరి ఊరికో చెట్టు.. గుడిగుడికో జమ్మి చెట్టు అనే నినాదంతో గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ నేత జోగినపల్లి సంతోష్ కుమార్ ఈ రోజు హనుమకొండ పద్మాక్షి గుట్ట ఆలయ రహదారిలో మొక్కలు నాటే
వినయ్భాస్కర్


వరంగల్, 21 సెప్టెంబర్ (హి.స.)

ఊరి ఊరికో చెట్టు.. గుడిగుడికో జమ్మి చెట్టు అనే నినాదంతో గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ నేత జోగినపల్లి సంతోష్ కుమార్ ఈ రోజు హనుమకొండ పద్మాక్షి గుట్ట ఆలయ రహదారిలో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు. ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ భాస్కర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.తొలుత పద్మాక్షి గుట్ట మీద అమ్మవారికి పూజ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రెండు జమ్మి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని పాడి పంటలతో సస్యశ్యామలం చేసిన ఘనత ఉద్యమ నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. తెలంగాణలో అడవుల శాతం పెంచేందుకు పదేళ్ల తెలంగాణకు హరితహారం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి కోట్లాది మొక్కలు నాటారని గుర్తు చేశారు గ్రీన్ ఇండియా చాలెంజ్ పేరుతో లక్షలాది మొక్కలను నాటారని, ఈ కార్యక్రమ నిర్వాహకులు సంతోష్ కుమార్ ప్రజల్లో పర్యావరణ అభివృద్ధి అవగాహనను పెంచుతున్నారన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande