హైదరాబాద్, 21 సెప్టెంబర్ (హి.స.)
గాజులరామారంలో హైడ్రా దూకుడు పెంచింది. మేడ్చల్ జిల్లాలోని కుత్బుల్లాపూర్ మండలం సర్వే నెంబర్ 307 లోని ప్రభుత్వ భూమి రక్షణే ధ్యేయంగా హైడ్రా ఆధ్వర్యంలో యాక్షన్ టీమ్ రంగంలోకి దిగింది. రెవిన్యూ, జీహెచ్ఎంసీ శాఖల అధికారుల సమన్వయం, భారీ పోలీస్ బందోబస్త్ తో కలిసి ఆదివారం ఉదయం నుండే కూల్చివేతలు చేపట్టారు. మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి శనివారం సర్వే నెంబర్ 307 కబ్జాలపై సీరియస్ అవుతూ.. వాటిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి వెళ్లారు. ఆయన వచ్చి పోయిన మరునాడే హైడ్రా బృందం రెవిన్యూ, జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి పోలీస్ ప్రొటెక్షన్తో కలిసి కూల్చివేతలకు దిగడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..