సెల్ఫీ తీసిన ప్రాణం.. కొంగాల జలపాతంలో పడి యువకుడు గల్లంతు
తెలంగాణ, ములుగు. 21 సెప్టెంబర్ (హి.స.) ములుగు జిల్లా వాజేడు మండలంలోని కొంగాల జలపాతం వద్ద విషాదం చోటుచేసుకుంది. జలపాతంలో పడి యువకుడు గల్లంతయ్యాడు. సెల్ఫీ తీసుకోడానికి జలపాతం దగ్గర కి వెళ్లి జారీ పడి యువకుడు మృతి చెందినట్లు సమాచారం. గల్లంతు అయిన యువక
యువకుడు గల్లంతు


తెలంగాణ, ములుగు. 21 సెప్టెంబర్ (హి.స.)

ములుగు జిల్లా వాజేడు మండలంలోని కొంగాల జలపాతం వద్ద విషాదం చోటుచేసుకుంది. జలపాతంలో పడి యువకుడు గల్లంతయ్యాడు. సెల్ఫీ తీసుకోడానికి జలపాతం దగ్గర కి వెళ్లి జారీ పడి యువకుడు మృతి చెందినట్లు సమాచారం.

గల్లంతు అయిన యువకుడు మహాశ్విన్ హైదరాబాద్ ఉప్పల్ కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అనుమతి లేకున్నా ఉదయాన్నే 8 మంది స్నేహితులు జలపాతం వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదబారిన పడ్డాడు. దుసలపాటి జలపాతం వద్ద గల్లంతయిన యువకుడి కోసం రెస్క్యూ టీంతో గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande