హైదరాబాద్, 21 సెప్టెంబర్ (హి.స.)
నేర నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని సోనియా గాంధీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని తెలిపారు. కీలకమైన కేసుల చేధనలో సీసీ కెమెరాల పాత్ర గణనీయంగా ఉందన్నారు.
ఇటీవల కాలంలో సీసీ కెమెరాల వినియోగం భారీగా పెరిగిందన్నారు. సీసీ కెమెరాలు అన్ని కాలనీల్లో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కాలనీల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు దాతలు ముందుకు రావాలని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..