తెలంగాణ, వనపర్తి. 21 సెప్టెంబర్ (హి.స.)
ఆరోగ్య తెలంగాణ సాధనలో ప్రతి
ఒక్కరూభాగస్వాములు అవ్వాలని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ మైదానంలో పదకొండవ అంతర్ జిల్లా టోర్నమెంట్ ను వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డితో కలిసి వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా శివసేనారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడల హబ్డి మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. యువత గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ క్రీడలపై తమదృష్టి సారించాలన్నారు. గత పది సంవత్సరాల బి. ఆర్.ఎస్ ప్రభుత్వంలో క్రీడా రంగాన్ని నిర్వీర్యం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఏడాదిలోనే రూ.850 కోట్లు క్రీడారంగా అభివృద్ధికి కేటాయించిందని గుర్తు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు