తిరుపతి, 21 సెప్టెంబర్ (హి.స.)
,మహాలయ అమావాస్య నేపథ్యంలో తిరుపతిలోని కపిల తీర్థానికి భక్తులు భారీగా పోటెత్తారు. కపిలతీర్థంలో పిండాలు, తర్పణాలు వదిలేందుకు భక్తులు ఆదివారం భారీగా తరలి వచ్చారు. అయితే ఆలయంలోకి వెళ్లే మొదటి ఆర్చి వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయక పోవడంతో.. వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం. ఎస్పీ వాహనంతోపాటు పోలీస్ అధికారుల వాహనం ఆలయం సమీపంలోని చేరుకోవడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ