అనంతపురం, 21 సెప్టెంబర్ (హి.స.)
, 'ఠాగూర్' సినిమాలోని హాస్పిటల్ సీన్ మరోసారి నిజ జీవితంలో రిపీట్ అయింది. ధర్మవరానికి చెందిన పార్వతి అనే మహిళకు ట్రీట్మెంట్ పేరిట ఈ ఘనకార్యం చేశారు సదరు ఆస్పత్రి డాక్టర్లు. ఊపిరితిత్తుల సమస్యతో రెండు రోజుల ముందు ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన పార్వతి.. చికిత్స సమయంలోనే మరణించారు. కానీ, డాక్టర్లు పార్వతి చనిపోయిన విషయాన్ని బాధిత కుటుంబానికి తెలియకుండా వెంటిలేటర్ పై ఉంచి చికిత్స కొనసాగిస్తున్నట్లు నటించారు. భారీ ఫీజులు వసూలు చేసి, కుటుంబాన్ని మోసం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ