దమ్ముంటే సీబీఐ విచారణ చేయించండి : భూమన కరుణాకర్
తిరుమల, 21 సెప్టెంబర్ (హి.స.)తిరుమల పరకామణిలో జరిగిన కోట్ల రూపాయల కుంభకోణంలో ఉన్న నిందితుల్ని బయటకు లాగేందుకు రంగం సిద్ధమైన వేళ.. వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకల్ని పక్క
దమ్ముంటే సీబీఐ విచారణ చేయించండి : భూమన కరుణాకర్


తిరుమల, 21 సెప్టెంబర్ (హి.స.)తిరుమల పరకామణిలో జరిగిన కోట్ల రూపాయల కుంభకోణంలో ఉన్న నిందితుల్ని బయటకు లాగేందుకు రంగం సిద్ధమైన వేళ.. వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకల్ని పక్కదోవ పట్టించామని తమపై అనవసరమైన ఆరోపణలు చేయడం కాదని, దమ్ముంటే సీబీఐతో విచారణ చేయించాలని ఛాలెంజ్ చేశారు. పరకామణి చోరీని బయటపెట్టిందే తామని, రవికుమార్ 20 ఏళ్లుగా స్వామివారి సొమ్మును దోచుకున్నాడని, 15 సంవత్సరాలు చంద్రబాబు హయాంలోనే చోరీలు జరిగాయని ఆరోపించారు. ఆనాడు చంద్రబాబు ఎందుకు పట్టుకోలేక పోయారని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో అతను ఎన్నిసార్లు దొంగతనం చేసి ఉంటే రూ.100 కోట్లను కూడబెట్టి ఉంటాడని ప్రశ్నించారు. తమ హయాంలోనే ఆ చోరీ విషయం బయటికి వచ్చిందని, రవికుమార్ ను పట్టుకుని రూ.100 కోట్లు రికవరీ చేశామని బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. వెంకటేశ్వరస్వామి భక్తుడిగా ఛాలెంట్ చేస్తున్నా.. దమ్ముంటే సీబీ సీఐడీతో కాదు.. సీబీఐతో పరకామణి వ్యవహారంపై విచారణ చేయించాలని భూమన కరుణాకర్ ఛాలెంజ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande