పాక్‌ మళ్లీ కవ్వింపులు.. నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు
న్యూఢిల్లీ,21,సెప్టెంబర్ (హి.స.)ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్‌ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. (Pakistan) కుప్వారాలోని నౌగామ్‌ సెక్టర్‌ వద్ద భారత్- పాక్‌ బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. శనివారం సాయంత్రం ఎల్‌వోసీ వె
Enc


న్యూఢిల్లీ,21,సెప్టెంబర్ (హి.స.)ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్‌ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. (Pakistan) కుప్వారాలోని నౌగామ్‌ సెక్టర్‌ వద్ద భారత్- పాక్‌ బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి.

శనివారం సాయంత్రం ఎల్‌వోసీ వెంబడి పాక్‌ బలగాలు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాయని అధికార వర్గాలు తెలిపాయి. వీటిని భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టినట్లు వెల్లడించాయి. దాదాపు గంటపాటు సాగిన ఈ కాల్పుల్లో ఎవరికీ గాయాలు కాలేదని పేర్కొన్నాయి. తాజా ఘటనకు సంబంధించి భారత సైన్యం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande