గయాలో పిండ ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.
గయా/న్యూఢిల్లీ,21,సెప్టెంబర్ (హి.స.): బిహార్‌లోని గయాలో ప్రసిద్ధ విష్ణుపాదా దేవాలయంలో తమ పూర్వీకుల ఆత్మకు శాంతి కలగాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం పిండ ప్రదానం సహా జల తర్పణాలు సమర్పించారు. ఈ విషయాన్ని అక్కడి ఆలయ ట్రస్ట్‌ అధ్యక్షుడు శంభు లాల్‌
Draupadi murmu


గయా/న్యూఢిల్లీ,21,సెప్టెంబర్ (హి.స.): బిహార్‌లోని గయాలో ప్రసిద్ధ విష్ణుపాదా దేవాలయంలో తమ పూర్వీకుల ఆత్మకు శాంతి కలగాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం పిండ ప్రదానం సహా జల తర్పణాలు సమర్పించారు. ఈ విషయాన్ని అక్కడి ఆలయ ట్రస్ట్‌ అధ్యక్షుడు శంభు లాల్‌ విఠల్‌ వెల్లడించారు. పితృపక్షం సమయంలో ప్రతి ఏడాది భక్తులు అధిక సంఖ్యలో ఈ ఆలయానికి తరలివస్తారు.

వ్యాపార దిగ్గజం ముకేశ్‌ అంబానీ సైతం గయాలోని విష్ణుపాదా ఆలయంలో తన పూర్వీకులకు పిండ ప్రదానం చేశారు. ఆయన వెంట చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ కూడా ఉన్నారు. పిండ ప్రదానం చేసిన అనంతరం పూర్వీకుల బహీఖాతా (వంశపారంపర్య పత్రాలు) కుటుంబాల వివరాలను చూసి ముకేశ్‌ అంబానీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారని అక్కడి ఓ పూజారి తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande