నారావారిపల్లికి స్కోచ్ ​అవార్డు దక్కడం గర్వంగా ఉంది : సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి, 21 సెప్టెంబర్ (హి.స.) స్వర్ణ నారావారిపల్లి ప్రాజెక్టుకు (Swarn Naravaripalli Project ) మొదటి సంవత్సరంలోనే స్కోచ్ గోల్డెన్ అవార్డు (Skoch Golden Award) దక్కడం గర్వంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గ
చంద్రబాబు


అమరావతి, 21 సెప్టెంబర్ (హి.స.) స్వర్ణ నారావారిపల్లి ప్రాజెక్టుకు (Swarn Naravaripalli Project ) మొదటి సంవత్సరంలోనే స్కోచ్ గోల్డెన్ అవార్డు (Skoch Golden Award) దక్కడం గర్వంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ (Green Energy) వైపు వేసిన తొలి అడుగులో స్వర్ణ నారావారిపల్లి ప్రాజెక్ట్‌కి స్కోచ్ గోల్డెన్ అవార్డు లభించిందన్నారు. ప్రాజెక్ట్ ప్రారంభమైన తొలి సంవత్సరంలోనే ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కడం ముదావహం అని తెలిపారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ బృందానికి, అలాగే ఇందులో భాగమైన ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాననటి ఎక్స్ (X)​లో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా కేవలం 45 రోజుల వ్యవధిలోనే 1,600 ఇళ్లలో ఉచితంగా సోలార్ ప్యానెల్‌ (Solar Panels)లు ఏర్పాటు చేయడం విశేషం. దీని వల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గి, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడనుందని ఆయన వివరించారు. ఇది స్వర్ణాంధ్ర వైపు మరో ముందడుగు అని కొనియాడారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande