H1-B వీసాపై స్వరం మార్చిన ట్రంప్‌ అంకుల్.. వైట్‌ హౌజ్‌ నుంచి మరో కీలక ప్రకటన
న్యూఢిల్లీ,21,సెప్టెంబర్ (హి.స.) తాజా 1-B వీసాపై వైట్ హౌస్ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుత వీసాలకు, రెన్యువల్స్ కి తాజా ఫీజు పెంపు నిబంధన వర్తించదని వెల్లడించింది. కొత్తగా వచ్చే ఏడాది నుంచి జారీ చేయనున్న వీసాలకు మాత్రమే లక్ష డాలర్ల ఫీజు వర్తిస్తుందని వ
White House


న్యూఢిల్లీ,21,సెప్టెంబర్ (హి.స.)

తాజా 1-B వీసాపై వైట్ హౌస్ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుత వీసాలకు, రెన్యువల్స్ కి తాజా ఫీజు పెంపు నిబంధన వర్తించదని వెల్లడించింది. కొత్తగా వచ్చే ఏడాది నుంచి జారీ చేయనున్న వీసాలకు మాత్రమే లక్ష డాలర్ల ఫీజు వర్తిస్తుందని వైట్‌హౌస్‌ స్పష్టం చేసింది. 2025 లాటరీ వీసాలకు సైతం పాత ఫీజులే వర్తిస్తాయని వెల్లడించింది. అయితే కొత్తగా హెచ్‌1 బి వీసాకు దరఖాస్తు చేసుకునే వారు లక్ష డాలర్ల ఫీజు జీవిత కాలానికి ఒకసారి మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని స్పష్ఠీకరించింది. ఇప్పటికే H-1B వీసాలు కలిగి ఉన్నవారు, ప్రస్తుతం US వెలుపల ఉన్నవారు తిరిగి ప్రవేశించడానికి ఫీజు వసూలు చేయమని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఎక్స్‌లో చేసిన ట్వీట్‌లో స్పష్టం చేశారు.

ఇది వార్షిక రుసుము కాదు. ఇది పిటిషన్‌కు మాత్రమే వర్తించే ఒకేసారి చెల్లించాల్సిన రుసుము. H-1B వీసా హోల్డర్లు ఎప్పటి మాదిరిగానే దేశం విడిచి వెళ్లి తిరిగి ప్రవేశించవచ్చు. వీరికి నిన్నటి ప్రకటన ఏవిధంగానూ ప్రభావితం చేయదు.. ఇది కొత్త వీసాలకు మాత్రమే వర్తిస్తుంది. ప్రస్తుత వీసాదారులకు, రెన్యువల్‌కు వర్తించదు. ఇది కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుంది’ అని ఆమె తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande