హైదరాబాద్, 24 సెప్టెంబర్ (హి.స.)
పాకిస్తాన్పై భారీ విజయాన్ని సాధించిన
భారత్.. ఆసియా కప్ 2025 సూపర్ 4లో తన తదుపరి మ్యాచ్లో బంగ్లాదేశ్తో నేడు (సెప్టెంబర్ 24) తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో స్పిన్నర్ల పాత్ర కీలకమని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు రెండు జట్ల మధ్య జరిగిన 17 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లలో బంగ్లాదేశ్ ఒక్కసారి మాత్రమే విజయం సాధించగలిగింది. గణాంకాల పరంగా చూస్తే భారత జట్టు స్పష్టమైన ఫేవరెట్గా నిలుస్తోంది. అయితే, చిన్న ఫార్మాట్ కావడంతో బంగ్లాదేశ్ స్పిన్నర్లు అద్భుత ప్రదర్శన చేస్తే ఆటలో ట్విస్ట్ రావచ్చు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..