అమరావతి, 24 సెప్టెంబర్ (హి.స.)
యూరోపియన్ దేశాల్లో శ్రీనివాస కళ్యాణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తాజాగా ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లో శ్రీనివాస కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. టీటీడీ, ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌తోపాటు ఐర్లాండ్‌లోని తెలుగు సమాజం సంయుక్తంగా నిర్వహించిన ఈ కళ్యాణానికి దాదాపు 3, 500 మందికిపైగా భక్తులు హాజరయ్యారు. ఈ కళ్యాణాన్ని టీటీడీ ఏఈవో మల్లికార్జున ప్రసాద్ కలపాల పర్యవేక్షణలో ప్రధాన పూజారి రంగనాథ్ నేతృత్వంలోని టీటీడీ అర్చక బృందం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఐర్లాండ్ మంత్రి జాక్ చాంబర్స్, ఫింగల్ కౌంటీ కౌన్సిల్ నుంచి కౌన్సిలర్ టామ్ కిట్ తదితర ప్రముఖులు సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ