రాబోయే 24 గంటల్లో ఉత్తర కోస్తాలో నీ జిల్లా ప్రాంతాల్లో భారీ.వర్షం
అమరావతి, 24 సెప్టెంబర్ (హి.స.) రాబోయే 24 గంటల్లో ఉత్తర కోస్తాలోని పార్వతీపురం, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీరం వెంబడి బలమైన ఈశాన్య గాలులు వీచే అవకాశముందని తెలిపింది. తీ
రాబోయే 24 గంటల్లో  ఉత్తర కోస్తాలో నీ జిల్లా ప్రాంతాల్లో భారీ.వర్షం


అమరావతి, 24 సెప్టెంబర్ (హి.స.)

రాబోయే 24 గంటల్లో ఉత్తర కోస్తాలోని పార్వతీపురం, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీరం వెంబడి బలమైన ఈశాన్య గాలులు వీచే అవకాశముందని తెలిపింది. తీరం ప్రాంతాల వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తక్కువ ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ పరికరాల వాడకంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande