సమాజ చైతన్యంలో కవులు, కళాకారుల పాత్ర కీలకం.. మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, 24 సెప్టెంబర్ (హి.స.) సమాజ చైతన్యంలో కవులు, కళాకారుల పాత్ర కీలకమని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బతుకమ్మ సంబరాల్లో భాగంగా బుధవారం రవీంద్రభారతిలో ఏర్పాటుచేసిన కవి సమ్మేళనం కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి
మంత్రి జూపల్లి


హైదరాబాద్, 24 సెప్టెంబర్ (హి.స.)

సమాజ చైతన్యంలో కవులు,

కళాకారుల పాత్ర కీలకమని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బతుకమ్మ సంబరాల్లో భాగంగా బుధవారం రవీంద్రభారతిలో ఏర్పాటుచేసిన కవి సమ్మేళనం కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. స్వాతంత్రోద్యమం, తెలంగాణ సాయుధ పోరాటం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారులు, సాహితీవేత్తలు పాత్ర అమోఘమని, ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ఎంతగానో కృషి చేశారని అన్నారు. మన తెలుగు సాహిత్యానికి ఏనలేని చరిత్ర ఉందని, నన్నయ, తిక్కన, ఎర్రప్రగడ నుంచి కృష్ణ శాస్త్రి, శ్రీశ్రీ తర్వాత ధాశరథి కాళోజీ లాంటి వారి రచనలు ప్రజలను చైతన్యం, జాగృతి పరిచాయని చెప్పారు.

ముఖ్యంగా వారిలో ఉన్న సృజనాత్మకతను బయటకు తెచ్చి సమాజంలో మార్పు కోసం కృషి చేయడం అభినందనీయమని కొనియాడారు. సామాజిక రుగ్మతలు, యువతలో పెడధోరణులు నేటి సమాజాన్ని పట్టిపీడిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులను రేపటి పౌరులుగా గురువులు తీర్చిదిద్దినట్లు, సమాజాన్ని తట్టిలేపే శక్తి కవులు, కళాకారులు, సాహితీవేత్తలకే ఉందని చెప్పారు. తెలంగాణ సమాజంలో ఒక సామాజిక చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత కవులు, రచయితలు, సాహితీవేత్తలు, మేధావులు, కళాకారులపై ఉందన్నారు. సమాజాన్ని అవలోకనం చేసుకుంటూ అందరి మన్ననలు పొందుతూ కవులు చైతన్య స్ఫూర్తితో తమ రచనలు కొనసాగిస్తూ.. సమాజ చైతన్య ఉన్నతికి కృషి చేయాలని కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande