అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు కార్డన్ సెర్చ్ : జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
తెలంగాణ, ఆదిలాబాద్. 25 సెప్టెంబర్ (హి.స.) గ్రామాల్లో శాంతి భద్రతలను పెంచడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలను అడ్డువేసేందుకు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సిరికొండ మండలం లోనికేశవ పట్నం లో గురువారం ఉట్నూ
ఆదిలాబాద్ ఎస్పీ


తెలంగాణ, ఆదిలాబాద్. 25 సెప్టెంబర్ (హి.స.)

గ్రామాల్లో శాంతి భద్రతలను పెంచడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలను అడ్డువేసేందుకు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సిరికొండ మండలం లోనికేశవ పట్నం లో గురువారం ఉట్నూర్ అడిషనల్ ఎస్పీ కాజల్ సింగ్, ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో 160 మంది పోలీసు సిబ్బందితో కమ్యూనిటీ కాంటాక్ట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్థులతో మాట్లాడారు.

నార్కోటిక్ డాగ్ రోమా సహాయంతో గంజాయి కోసం తనిఖీ చేశామని వివరించారు. తల్లి,దండ్రులు యువతకు చదువుకునేలా ప్రోత్సహించాలని, చదువు వలన భవిష్యత్తు, మంచి పేరు లభిస్తాయని సూచించారు. ఒకే గ్రామం నుంచి గత ఐదు సంవత్సరాలలో 90 కేసులు నమోదు అయ్యాయని, ఇక నుంచి గ్రామస్థులు సన్మార్గంలో వెళ్లాలని సూచించారు. గ్రామంలో నమోదైన రౌడీషీట్లు, సస్పెక్ట్ షీట్లను పరిశీలిస్తామని, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనని వారిని పరిశీలించి రౌడీ షీట్లను, సస్పెక్ట్ షీట్లను ఎత్తివేస్తామన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande