అమరావతి, 25 సెప్టెంబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. లిక్కర్ కేసులో నిందితులు ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, పైలా దిలీప్ లకు ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ ఆదేశాలు రద్దు చేయాలని సిట్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేసింది. నిందితుల తరపున వాదనలు నిరంజన్ రెడ్డి వినిపించగా సిట్ తరపున వాదనలు సిద్ధార్ధ లూథ్రా వినిపించారు. సిద్ధార్ధ లుథ్రా వాదనలలో భాగంగా నిందితులకు ఏసీబీ కోర్టు ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్ ఉత్తర్వులు చట్ట విరుద్దమని అన్నారు. ఆగస్టు 11న సిట్ అదనపు చార్జి షీట్ దాఖలు చేసిందని అందులో ఈ నలుగురు నిందితుల పాత్ర గురించి వివరించినట్టు చెప్పారు. ఆగస్టు 18న ఏ33 బాలాజీ గోవిందప్ప రెగ్యులర్ బెయిల్ ఏసిబి కోర్టు డిస్మిస్ చేసిందనీ 23న చార్జి షీట్ పై అభ్యంతరాలు వ్యక్తం చేసిందని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ