హైదరాబాద్, 25 సెప్టెంబర్ (హి.స.)
టెర్రాసిస్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఫీల్డ్ స్టాఫ్ను భూభారతి కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారిని టీజీటీఎస్ కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తిస్తూ, అదేవిధంగా వేతలను పెంచుతూ తాజాగా ఆదేశాలు జారీ అయ్యాయి. టెరాసిస్ అనే ప్రైవేట్ సంస్థ తరఫున ధరణి ఆపరేటర్లుగా ఉన్న వారిని తెలంగాణ భూభారతి ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్గా టీజీటీఎస్ కాంట్రాక్టు ఉద్యోగులుగా సముచిత గౌరవాన్ని కల్పించారు. రూ.12 వేలు ఉన్న నెల జీతాన్ని రూ.28,148 లకు పెంచుతూ ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్కు విజయదశమి కానుక అయ్యింది.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు