కాలేశ్వరం ప్రాజెక్ట్ పై సిబిఐ ప్రాథమిక విచారణ షురూ..!
హైదరాబాద్, 25 సెప్టెంబర్ (హి.స.) తెలంగాణ రాజకీయాల్లో సెన్సేషనల్ క్రియేట్ చేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ ప్రాథమిక విచారణను ఇవాళ ప్రారంభించింది. ఈ ప్రాజెక్టులో అవకతవకలు, నిధుల ద
సిబిఐ కాలేశ్వరం


హైదరాబాద్, 25 సెప్టెంబర్ (హి.స.)

తెలంగాణ రాజకీయాల్లో సెన్సేషనల్ క్రియేట్ చేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ ప్రాథమిక విచారణను ఇవాళ ప్రారంభించింది. ఈ ప్రాజెక్టులో అవకతవకలు, నిధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేయాలని తెలంగాణ ప్రభుత్వం సీబీఐని కోరింది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం అంశంపై సీబీఐ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ఈ కేసుకు సంబంధించిన ప్రాథమిక వివరాలను సేకరిస్తోంది. కేసుకు విచారణ అర్హత ఉందో తేల్చేందుకు సీబీఐ అధికారులు రికార్డులను పరిశీలిస్తున్నారు. అందులో భాగంగా ఎన్డీఎస్ఏ, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాథమిక విచారణ అనంతరం ఎఫ్ఎఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande