విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రి సూపరిండెంట్ కార్యాలయాల్లో.సీబీఐ సోదాలు
అమరావతి, 25 సెప్టెంబర్ (హి.స.) విశాఖపట్నం: నగరంలోని కింగ్‌ జార్జ్‌ ఆస్పత్రి (కేజీహెచ్‌) సూపరింటెండెంట్‌ కార్యాలయంలో సీబీఐ సోదాలు చేపట్టింది. పశ్చిమ్‌బెంగాల్‌కు చెందిన విద్యార్థిని రీతూ ఆత్మహత్య వ్యవహారంలో జోక్యం చేసుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఇద్దరు
విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రి సూపరిండెంట్ కార్యాలయాల్లో.సీబీఐ సోదాలు


అమరావతి, 25 సెప్టెంబర్ (హి.స.)

విశాఖపట్నం: నగరంలోని కింగ్‌ జార్జ్‌ ఆస్పత్రి (కేజీహెచ్‌) సూపరింటెండెంట్‌ కార్యాలయంలో సీబీఐ సోదాలు చేపట్టింది. పశ్చిమ్‌బెంగాల్‌కు చెందిన విద్యార్థిని రీతూ ఆత్మహత్య వ్యవహారంలో జోక్యం చేసుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఇద్దరు అధికారులు తనిఖీలు చేపట్టారు. కేజీహెచ్‌ వైద్య వర్గాల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

2023 జులై 14న రీతూ అనే విద్యార్థిని విశాఖలో ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై ఆమె కుటుంబసభ్యులు నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థిని మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో సీబీఐ విచారణ చేపట్టింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande