అమరావతి, 25 సెప్టెంబర్ (హి.స.)
తిరుమల: తిరుమలలో ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సీఎం చంద్రబాబు ( ప్రారంభించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరును అధికారులు సీఎంకు వివరించారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు శ్రీవారి వైభవం తెలియజెప్పేలా వీడియోలు ప్రదర్శించాలని సీఎం సూచించారు. తితిదే నిర్వహణలోని అన్ని ఆలయాలనూ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించాలన్నారు.
శ్రీవారి దర్శనానికి నిత్యం వచ్చే వేల మంది భక్తుల ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) కృతిమ మేధస్సును (ఏఐ) వినియోగించనుంది. ఎన్‌ఆర్‌ఐల దాతృత్వంతో దేశంలో తొలిసారిగా తిరుమలలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చింది. వైకుంఠం-1 కాంప్లెక్స్‌లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీని ద్వారా భక్తుల రద్దీ నియంత్రణ, వసతి, భద్రత పెంపొందించేందుకు చర్యలు చేపట్టనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ