భారీ వర్షాలున్నాయి, అప్రమత్తంగా ఉండండి
నిరంతరం మానిటర్ చేయండి* - అధికారులను అప్రమత్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Revanth Reddy


హైదరాబాద్, 25 సెప్టెంబర్ (హి.స.)

రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ నివేదికపై అన్ని శాఖలను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు.

ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని నిరంతరం జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

అన్ని జిల్లాల కలెక్టర్లు హై అలెర్ట్ గా ఉండి పరిస్థితిని సమీక్షించాలని కోరారు.

అవసరమైతే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను ముందుగానే ఖాళీ చేయించి, పునరావాస కేంద్రాలను తరలించాలని సూచించారు.

అన్ని కాజ్ వేలను పరిశీలించాలని, రోడ్లపైకి వరద నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తుగా ట్రాఫిక్ ను నిలిపివేయాలన్నారు.

విద్యుత్ శాఖ ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని అంతరాయం లేకుండా కరెంట్ సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు.

వేలాడే వైర్లను తొలగించటంతో పాటు, ఎలాంటి ప్రాణాపాయం జరగకుండా చూడాలన్నారు.

దసరా సెలవులు ఉన్నప్పటికీ విద్యా సంస్థలు కూడా వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని కోరారు.

వర్షం కురిసే సమయంలో అవసరమైతేనే జనం రోడ్లపైకి రావాలని సూచించారు.

హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ, హైడ్రాతో పాటు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

....

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande