సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాలు.. కేసు నమోదుచేసిన ఈడీ
హైదరాబాద్, 25 సెప్టెంబర్ (హి.స.) సరోగసి పేరుతో పిల్లల ట్రాఫికింగ్కు పాల్పడిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ (Srushti Fertility Centre) అక్రమాల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ కేసులోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (
ఈడి కేసు


హైదరాబాద్, 25 సెప్టెంబర్ (హి.స.)

సరోగసి పేరుతో పిల్లల ట్రాఫికింగ్కు పాల్పడిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ (Srushti Fertility Centre) అక్రమాల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ కేసులోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ప్రవేశించింది. హైదరాబాద్ పోలీసులు నమోదుచేసిన ఎఫ్ఎఆర్ ఆధారంగా ఈడీ కేసు ఫైల్ చేసింది. సంతానం లేని దంపతుల నుంచి సరోగసి పేరుతో డాక్టర్ నమత్ర (Dr Namrata) భారీగా నగదు వసూలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఆమెను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు.

అబార్షన్ కోసం ఆసుపత్రికి వచ్చే గర్భిణీలకు నగదు ఆశ చూపి ప్రసవం తర్వాత వారి పిల్లల్ని డాక్టర్ నమ్రత కోనుగోలు చేసేవారు. అనంతరం సరోగసి ద్వారా పుట్టిన బిడ్డగా పిల్లలు లేని దంపతులను నమ్మించి పెద్ద ఎత్తున నగదు వసూలు చేశారు. నాలుగేండ్లలో దాదాపు రూ.500 కోట్ల వరకు లావాదేవీలు జరిపినట్లు ఆధికారులు గుర్తించారు. సికింద్రాబాద్లోపాటు విశాఖపట్నంలో ఫెర్టిలిటీ సెంటర్లు ఏర్పాటు చేసిన డాక్టర్ నమత్ర.. ఏజెంట్ల సాయంతో గర్భస్రావం చేయించుకోవాలని దవాఖానకు వచ్చే పేద మహిళలను లక్ష్యంగా చేసుకుని ఈ దందా కొనసాగించారు. ఈ నేపథ్యంలో డాక్టర్ నమ్రతను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande