అసలు రేవంత్ రెడ్డి ఎవరు? బీహార్లో అతనికి ఏం పని?.. మండిపడ్డ ప్రశాంత్ కిషోర్
హైదరాబాద్, 25 సెప్టెంబర్ (హి.స.) బీహారీలను తక్కువ చేస్తూ రెండేండ్ల కిందట వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇప్పుడు కాంగ్రెస్కు ''ఓట్ల'' కోసం అదే బీహార్లో పర్యటించడంపై జన్ సురాజ్ వ్యవస్థాపకులు ప్రశాంత్ కిషోర్ తీవ్ర స
ప్రశాంత్ కిషోర్


హైదరాబాద్, 25 సెప్టెంబర్ (హి.స.)

బీహారీలను తక్కువ చేస్తూ రెండేండ్ల కిందట వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇప్పుడు కాంగ్రెస్కు 'ఓట్ల' కోసం అదే బీహార్లో పర్యటించడంపై జన్ సురాజ్ వ్యవస్థాపకులు ప్రశాంత్ కిషోర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 'రేవంత్ రెడ్డి ఎవరు? బీహార్లో ఆయనకు ఏం పని?' అని సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు జాతీయ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో మాట్లాడారు.'రేవంత్ రెడ్డి ఎవరు? ఆయనకు బీహార్లో పనేంటి? కూలి పని అనేది బీహారీల డీఎన్ఏలోనే ఉందని మా ప్రజలను కించపరిచేలా మాట్లాడారు. ఇప్పుడు ఏ ముఖంతో ఓట్లు అడగడానికి వచ్చారు? రేవంత్ రెడ్డి బీహార్లోని ఏ గ్రామానికి, పట్టణానికి వెళ్లినా ప్రజలు, యువకులు ఆయన్ని తరిమి కొడతారు. రేవంత్ను బాయ్్కట్ చేయాలి' అని ప్రశాంత్ కిషోర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కర్ణాటక, తమిళనాడు, హర్యానాలో బీహారీలపై దాడులు జరుగుతున్నాయని, ఎంతోమంది బీహారీలు ప్రాణాలు కోల్పోతున్నారని ప్రశాంత్ కిషోర్ ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande