దిగొచ్చిన పసిడి..నేడు తెలుగు రాష్టాల్లో తగ్గిన బంగారం ధరలు!
ముంబై, 25 సెప్టెంబర్ (హి.స.)నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. మహిళలు అత్యంత ఎక్కువగా ఇష్టపడే దాంట్లో బంగారమే ముందుంటుంది.ఏ చిన్న ఫంక్షన్ జరిగినా సరే వారు బంగారం కొనుగోలు చేయడానికే ఎక్కువ ఇష్టపడతుంటారు. కానీ ఈ మధ్య కాలంలో బంగారం విపరీతంగా పెరిగిపోతు
Gold


ముంబై, 25 సెప్టెంబర్ (హి.స.)నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. మహిళలు అత్యంత ఎక్కువగా ఇష్టపడే దాంట్లో బంగారమే ముందుంటుంది.ఏ చిన్న ఫంక్షన్ జరిగినా సరే వారు బంగారం కొనుగోలు చేయడానికే ఎక్కువ ఇష్టపడతుంటారు. కానీ ఈ మధ్య కాలంలో బంగారం విపరీతంగా పెరిగిపోతుంది. ఇప్పటికే లక్ష మార్క్ దాటినే గోల్డ్ రేట్స్ రెండు లక్షలకు చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో సామాన్యులు బంగారం కొనాలంటేనే భయపడిపోవాల్సిన పరిస్థితులు ఎదురు అవుతున్నాయి.

ఇక గత కొన్ని రోజుల నుంచి భారీగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు నేడు గురువారం స్వల్పంగా తగ్గాయి. కాగా, ఈరోజు మనం బంగారం ఎలా ఉన్నాయో చూద్దాం.బులియన్‌ మార్కెట్లో గురువారం (సెప్టెంబర్ 25) 24 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ.1,15,360 గా ఉంది.(రూ.10 తగ్గింది), 22 క్యారెట్ల బంగారం తులం రూ.1,05,740 గా ఉంది. 18 క్యారెట్ల బంగారం తులం రూ.86,520 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande