ఏఐతో అశ్లీలం.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన అక్కినేని నాగార్జున
హైదరాబాద్, 25 సెప్టెంబర్ (హి.స.) నటుడు అక్కినేని నాగార్జున ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఏఐ సాయంతో తన అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు క్రియేట్ చేస్తున్నారని వాటితో పలు వెబ్ సైట్స్లలో బిజినెస్ చేస్తున్నారని ఇలాంటి పనులను వెంటనే ఆపేలా చర్యలు తీసుకోవా
నాగార్జున


హైదరాబాద్, 25 సెప్టెంబర్ (హి.స.)

నటుడు అక్కినేని నాగార్జున ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఏఐ సాయంతో తన అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు క్రియేట్ చేస్తున్నారని వాటితో పలు వెబ్ సైట్స్లలో బిజినెస్ చేస్తున్నారని ఇలాంటి పనులను వెంటనే ఆపేలా చర్యలు తీసుకోవాలని నాగార్జున తన పిటిషన్లో కోరారు. ఇంతకుముందు ఇలాంటి విషయం మీదే బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ కూడా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.

నాగార్జున తరపున పిటిషనర్ హైకోర్టులో వాదిస్తూ.. ఏఐ సాయంతో నాగార్జున పోర్నోగ్రఫీ కంటెంట్, లింక్స్ క్రియేట్ చేశారని కోర్టుకు వెల్లడించారు. టీ షర్టులపై ఆయన ఫోటో ముద్రించి బిజినెస్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇలాంటి పనులపై వెంటనే చర్యలు తీసుకుని నాగార్జున వ్యక్తిగత హక్కులను కాపాడాలని పిటిషన్లో కోరారు. అంతేగాకుండా నాగార్జున ఏఐ వీడియోలు క్రియేట్ చేసిన దాదాపు 14 వెబ్ సైట్స్ని వాటికి సంబంధించిన లింక్స్ని తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం నాగార్జున వ్యక్తిగత హక్కులను కాపాడుతమని తెలిపింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande