హైదరాబాద్, 25 సెప్టెంబర్ (హి.స.)
సాహితీ ఇన్ ఫ్రా రియల్ ఎస్టేట్ కంపెనీ
స్కామ్ కేసులో సినీ నటుడు జగపతిబాబు ఈడీ విచారణకు హాజరయ్యారు. సుమారు 4 గంటలపాటు ఈడీ అధికారులు జగపతిబాబును విచారించారు. ఆయన సాహితీ ఇన్ ఫ్రా సంస్థతో జరిపిన లావాదేవీలపై సుదీర్ఘంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సాహితీ ఇన్ ఫ్రా సంస్థతో తరచూ జరిపిన ఆర్థిక లావాదేవీలపై జగపతిబాబు సరైన సమాధానాలివ్వలేదని సమాచారం. సాహితీ సంస్థను ప్రమోట్ చేస్తూ గతంలో జగపతిబాబు పలు ప్రకటనల్లో నటించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు