తెలంగాణ, సిద్దిపేట. 25 సెప్టెంబర్ (హి.స.)
స్థానిక సంస్థల ఎన్నికల పై రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పూటకో మాట.. దోబూచులాట ఆడుతుందని ఎంపీ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో పండిట్ దీన్ దయాల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం..
ఎంపీ మాట్లాడుతూ.. బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ జీవో పాస్ చేయలేదన్నారు. జీవో పై ఎవరు కోర్టుకు వెళతారో తెలియని పరిస్థితుల్లో ప్రభుత్వ ఉపాధ్యాయుల సెలవులు రద్దు చేసి ఉద్యోగం చేయాలని ఒత్తిడి చేయడం సరికాదన్నారు. ఉపాధ్యాయుల సెలవులపై ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు.
పదేళ్ల బీఆర్ఎస్ కుటుంబ పాలనలో దోచుకున్న డబ్బులు కక్కించి పేద ప్రజలకు అందిస్తామని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. నేడు వారిని ఏం చేయాలో అర్థం కాక కాంగ్రెస్ ప్రభుత్వం కన్ఫ్యూజన్లో పడిపోయిందని ఎద్దెవా చేశారు. .
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు