హైదరాబాద్, 25 సెప్టెంబర్ (హి.స.)
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు
అందించడంలో ఫార్మసిస్టుల సేవలు కీలకం అని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు. వరల్డ్ ఫార్మసిస్ట్స్ డే సందర్భంగా ఫార్మసిస్టులకు శుభాకాంక్షలు తెలిపారు. బంజారాహిల్స్లోని క్యాంప్ ఆఫీసులో తనను కలవడానికి వచ్చిన ఫార్మసిస్టులతో కలిసి మంత్రి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వ హాస్పిటళ్లలో 730కి పైగా ఫార్మసిస్ట్ పోస్టులను భర్తీ చేస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు