హైదరాబాద్, 25 సెప్టెంబర్ (హి.స.)
ఓజీ సినిమా టికెట్ ధరలను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా.. దానిని సవాల్ చేస్తూ మహేశ్ యాదవ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. కొత్త సినిమాల టికెట్ల ధరలను పెంచడాన్ని సస్పెండ్ చేసింది. తాజాగా హైకోర్టు జారీ చేసిన ఈ ఉత్తర్వులపై మంత్రి కోమటిరెడ్డి స్పందించారు. సినిమా టికెట్ ధరలపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నామని తెలిపారు. కొత్త సినిమాల టికెట్ ధరలను పెంచేది లేదని తాను గతంలోనే అసెంబ్లీలో చెప్పానని, పక్క రాష్ట్రం జీఓ ఇవ్వడంతో ఇక్కడ కూడా కొన్ని సినిమాలకు వెసులుబాటు ఇచ్చామని పేర్కొన్నారు.
ఇకపై ఎలాంటి సినిమాలకైనా టికెట్ ధరలను పెంచుకునేలా అనుమతులు ఇవ్వబోమని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు