తెలంగాణ,కరీంనగర్. 25 సెప్టెంబర్ (హి.స.)
అన్ని మున్సిపాలిటీ, గ్రామాల్లో ప్రతి ఒక్కరు ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ నినాదంతో కార్యక్రమంలో భాగంగా మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హీ సేవా 2025 కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ నగరంలోని లోయర్ మానేరు డ్యాం సమీపంలో ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ నినాదంతో పరిశుభ్రత పనుల కార్యక్రమం ( శ్రమదానం) నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి.. చీపురు పట్టి మానేరు డ్యామ్ పరిసరాలు శుభ్రం చేశారు. విద్యార్థులతో కలిసి మానేరు పరిసరాల్లో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను స్వయంగా తొలగించారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు ప్రజల సహకారం కావాలి. అప్పుడే విజయవంతం అవుతాయి. వివిధ విభాగాల అధికారులు పోలీస్, ఫారెస్ట్, పారిశుద్ధ్య సిబ్బంది అందరూ కలిసి లోయర్ మానేరు డ్యామ్ దగ్గర ఈ కార్యక్రమం చేపట్టాం.. ఇది ఒక రోజు జరిగే కార్యక్రమం కాదు. ఇది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు.
హైదరాబాద్ లో ఒక విద్యార్థి ప్రతి ఆదివారం రెండు గంటలు లేక్స్ క్లీన్ చేస్తున్నారు. ఇలా అందరూ అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. కాలుష్యాన్ని తగ్గించడానికి మనం పర్యావరణాన్ని కాపాడుకోవాలని సూచించారు. మనం తిన్న తర్వాత వచ్చే కవర్లు ప్లాస్టిక్ తదితర వాటిని రోడ్లపై వేయరాదు. తడి పొడి చెత్తగా వేరు వేరుగా ఏర్పాటు చేయాలి. పర్యావరణాన్ని కాపాడుకుంటూనే మనం ఆరోగ్యం ఉంటాం.. భవిష్యత్ తరాలకు ఆరోగ్య సమాజాన్ని అందిస్తామని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు