పట్నా/దిల్లీ: 25 సెప్టెంబర్ (హి.స.): బిహార్ నుంచే ఎన్డీయే ఓటమికి నాంది పలుకుతామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తేల్చి చెప్పారు. మహాత్మా గాంధీ సత్యాగ్రహానికి నాంది పలికిన ఈ రాష్ట్రం.. ప్రస్తుతం సాగుతున్న ఓట్ల చోరీపై పోరాటంలో కలిసి రావాలని పిలుపునిచ్చారు. పట్నాలో బుధవారం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. పలువురు పార్టీ నేతలు పాల్గొన్న ఈ సమావేశంలో రెండు తీర్మానాలు చేయడంతోపాటు రాహుల్ గాంధీ తదితరులు మాట్లాడారు.
‘అత్యంత వెనుకబడిన వర్గాలకు (ఈబీసీ) నీతీశ్ కుమార్ చేసిందేమీ లేదు. 20 ఏళ్లుగా వారిని ఆయన ఓటు బ్యాంకుగా వినియోగించుకున్నారు. మేం అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తేస్తాం. బిహార్‌లో ఇండియా కూటమి అధికారం చేపడితే ఈబీసీ వర్గాలకు 10 అంశాల ఫార్ములాను తీసుకొస్తాం. ప్రైవేటు సంస్థల్లోనూ ఈబీసీ రిజర్వేషన్లను అమలు చేస్తాం. అధికారం చేపట్టగానే ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం తరహాలో ఈబీసీలకు చట్టం చేస్తాం. విదేశీ విధానం అనేది వ్యక్తిగత స్నేహం ఆధారంగా రూపొందదు. ప్రధాని మోదీ భారతీయ విదేశాంగ విధానాన్ని కుప్పకూల్చారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ