ఓజీ మూవీ ప్రీమియర్ షో.. స్క్రీన్ను చింపి అభిమానుల రచ్చ..
బెంగళూరు, 25 సెప్టెంబర్ (హి.స.) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన OG” మూవీ ప్రీమియర్స్ సమయంలో బెంగళూరు థియేటర్లో అసహ్యకర ఘటన చోటుచేసుకుంది. KR పూర్ ప్రాంతంలోని ఒక ప్రముఖ థియేటర్లో ప్రత్యేక షో మద్యలో కొంత మంది ఫ్యాన్స్ కత్తిని తెచ్చి స్క్రీన్ను చింప
ఓజి సినిమా


బెంగళూరు, 25 సెప్టెంబర్ (హి.స.)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన OG” మూవీ ప్రీమియర్స్ సమయంలో బెంగళూరు థియేటర్లో అసహ్యకర ఘటన చోటుచేసుకుంది. KR పూర్ ప్రాంతంలోని ఒక ప్రముఖ థియేటర్లో ప్రత్యేక షో మద్యలో కొంత మంది ఫ్యాన్స్ కత్తిని తెచ్చి స్క్రీన్ను చింపారు. ఈ కారణంగా షోను తాత్కాలికంగా నిలిపివేశారు. సినిమా ప్రీమియర్స్లో అభిమానుల ఉత్సాహం సాధారణం కాగా, కత్తులు, ఇతర ప్రమాదకర వస్తువులు తీసుకురావడం భద్రతకు ముప్పుగా మారింది. థియేటర్ యాజమాన్యం ఈ సంఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా భద్రతా చర్యలను పెంచారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande