ఓజి సినిమా చూస్తున్న ప్రేక్షకులపై పడిన స్పీకర్.. ఇద్దరికి తీవ్రగాయాలు.
తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం. 25 సెప్టెంబర్ (హి.స.) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం 0G సినిమాను తొలి రోజు థియేటర్ లో చూసేందుకు వెళ్లిన ఫ్యాన్స్ కు చేదు అనుభవం ఎదురైంది. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఏషియన
ఓజీ సినిమా


తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం. 25 సెప్టెంబర్ (హి.స.)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం 0G సినిమాను తొలి రోజు థియేటర్ లో చూసేందుకు వెళ్లిన ఫ్యాన్స్ కు చేదు అనుభవం ఎదురైంది. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఏషియన్ థియేటర్లో ఓజి సినిమా చూస్తున్న ప్రేక్షకులపై స్పీకర్ బాక్స్ పడింది. స్పీకర్స్ పడడంతో ఇద్దరు ప్రేక్షకులకు తీవ్రగాయాలు అయ్యాయి. దాంతో వారిని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకువెళ్లారు. మరోవైపు ధియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే చాలా మంది ఆడియెన్స్ టికెట్లు లేకుండా థియేటర్లో చొరబడ్డారని ప్రేక్షకులు మండిపడుతున్నారు. థియేటర్ కెపాసిటీ మించి సుమారుగా 1200 మంది ప్రేక్షకులను థియేటర్లో అనుమతించడంతో ఉక్కిరిబిక్కిరి అయ్యి ఇబ్బంది పడ్డామని కనీస రక్షణ చర్యలు లేవని థియేటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ప్రేక్షకులు కోరుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande